మాంటెనెగ్రోలో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. తుపాకీ చేతబట్టిన దుండగుడు మొత్తం 11 మందిని కాల్చి చంపాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. దీనిపై మాంటెనెగ్రో ప్రధాన మంత్రి డ్రిటన్ అబాజోవిక్ స్పందించారు. ఆ ఘటనను భయంకరమైన విషాదంగా అభివర్ణించారు. శుక్రవారం సాయంత్రం నుంచి దేశంలో మూడు రోజుల సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు.