విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడురోజులుగా కొనసాగుతున్న పవిత్రోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. పూర్ణాహుతి కార్యక్రమంతో కనకదుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు ముగుస్తాయని అధికారులు వెల్లడించారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో వివిధ రకాల ఆర్జిత సేవలన్నింటినీ అధికారులు రద్దు చేశారు. ఆదివారం నుంచి కుంకుమ పూజతో సహా వివిధ సేవలన్నింటిలో భక్తులు పాల్గొనే విధంగా అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.