పుదీనాతో రుచికరమైన వంటలే కాదు ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించే గుణం ఉంటుంది. ఇది గొంతుకు చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో దీంతో కూల్ మోజిటో డ్రింక్‌గా మారుతుంది. కడుపునొప్పి, బలహీనత, మానసిక స్థితికి, జలుబు వంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని అన్ని సీజన్లలో తీసుకుంటారు. పుదీనా అంటే అన్ని కాలల్లో ఉపయోగపడే ఒక మూలిక అని డాక్టర్లు అంటున్నారు. చలి కాలంలో గొంతు నొప్పికి, వర్షాకాలం వేడి టీగా మారిపోతుంది. పుదీనా వల్ల కలిగే 16 ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా వల్ల ఉపయోగాలివే:
పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెపాసిటీలు ఉండటంతో అలర్జీలను నయం చేస్తుంది.
కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
అంతేకాదు.. గ్యాస్ ట్రబుల్, ఉబ్బరం, రుతుస్రావం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు పిత్త దోషాలను అరికడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
తలనొప్పి నుంచి కూడా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
ప్రాణాంతక పేగు సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది. నోటి సంరక్షణకు, దుర్వాసనకు కూడా మంచి చికిత్సను అందిస్తుంది.
బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా ఇది మంచి ఉపకారిణి. తల్లిపాలు ఇచ్చేటప్పుడు మొదటగా వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
వికారం రాకుండా చేసి అస్తమాకు చికిత్స చేస్తుంది. పుదీనా నోస్ బ్లాకేజీని తగ్గిస్తుంది.
దీర్ఘకాలిక దగ్గుకు ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది.
మెంతాల్ సహజమైన సుగంధ పదార్థాం ఇది కఫం, శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అది సులభంగా బయటకు పంపించేస్తుంది.
పుదీనా టీతో గొంతునొప్పి సమస్య తగ్గుతుంది.
అంతేకాదు జ్వరాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ప్రేరేపిస్తుంది.
ఇది ఫుడ్ నుంచి పోషకాలను గ్రహించి, కొవ్వును వినియోగించి ఉపయోగపడే శక్తిగా మారుస్తుంది.
జ్ఞాపకశక్తిని కోల్పోకుండా నిరోధిస్తుంది. డిప్రెషన్, అలసట తగ్గిస్తుంది. చర్మ సంరక్షణకు ఇన్ఫెక్షన్లు, దురదలను నయం చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది.