మనం అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటాం. కొందరు పచ్చి మిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే కారంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కారం తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎండు మిరపకాయల పొడి (కారం)లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
- మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. అంతేకాకుండా వాపులను తగ్గిస్తుంది.
- అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువగా తినకూడదని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారం.. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సమస్యలను పోగొడతాయని తేలింది.
- కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
- కారం తింటే తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.