'అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం' ప్రతి ఏటా ఆగస్టు 13న నిర్వహిస్తున్నారు. 1976 ఆగస్టు 13న మొదటిసారి ప్రారంభమైన ఈ ప్రత్యేక రోజున ఎడమ చేతి వాటం ప్రజల అసౌకర్యాలు, కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఇక ప్రపంచ జనాభాలో పది శాతానికి పైగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.