టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అమ్మాయిలను వాడుకోవడం తప్పా, బాగుచేయడం తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లను ఆయన కలియుగ రావణాసురులుగా అభివర్ణించారు. ఈ మేరకు శనివారం కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలుగా చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని కూడా జయరాం మరో ఘాటు వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు అమ్మాయిలను రాజకీయం కోసం వాడుకోవడం తెలుసు తప్పించి.. మహిళలను ఆదుకోవడం తెలియదన్నారు. చంద్రబాబు రాజకీయాలకు బలి కావొద్దంటూ ఆయన మహిళలకు సూచించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ చెప్పినా... ఈ విషయంపై మరింత వివాదం రాజేసేందుకు టీడీపీ యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.