ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సహాయం పొందుతూనే...మన విన్నపాన్ని తిరస్కరించిన శ్రీలంక

international |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 12:03 AM

తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న  శ్రీలంకకు భారత్ అందించిన సహాయం అంతా ఇంతా కాదు.  ఇంతటి సహాయం పొందిన శ్రీలంక భారతదేశ విన్నపాన్ని మన్నించకపోగా మన శత్రుదేశమైన చైనాకు సహకారం అందించేలా వ్యవహరించింది. చైనా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట పోర్టుకు వస్తుండడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. అది సర్వేనౌక మాత్రమే కాకుండా, దాంట్లో నిఘా వేసేందుకు అత్యాధునిక పరికరాలు ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ చైనా నౌకకు అనుమతి ఇవ్వరాదని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది. అయితే, భారత్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా శ్రీలంక ప్రభుత్వం హంబన్ టోట పోర్టులో లంగరు వేసేందుకు చైనా నౌక యువాన్ వాంగ్-5కి అనుమతి ఇచ్చింది. 


దీనిపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్ తన ఆందోళనలను ప్రధాని రణిల్ విక్రమసింఘేకు తెలియజేసిందని, అయితే, ఆ నౌకను ఎందుకు అనుమతించకూడదో సరైన కారణాలు చెప్పడంలో భారత్ విఫలమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 16 నాటికి యువాన్ వాంగ్-5 నౌక హంబన్ టోట పోర్టుకు రానున్నట్టు చైనా దౌత్యకార్యాలయం నుంచి సమాచారం అందిందని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com