మాచర్ల: వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు అవతున్న తీరును, గత మూడేళ్లలో గ్రామానికి జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.