తెనాలి: అంగలకుదురు గ్రామానికి చెందిన రాజేశ్వరికి తిరుపతికి చెందిన కోటకొండ మోజుతో 2019లో వివాహమైంది. కొన్నాళ్లు బాగానే ఉన్న అతను రోజూ మద్యం తాగి వచ్చి భార్యను వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. శనివారం రూరల్ ఎస్ఐ జి. ఏడుకొండలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.