శెట్టూరు మండల పరిధిలోని అయ్యగార్లపల్లి గ్రామంలో ఆదివారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.