నంద్యాల నుంచి కడపకు వెళ్లే డెమో రైలుకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రైల్వేలైన్ మార్గంలో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడంతో విద్యుత్ రైళ్లు తిరుగుతున్నాయి. కోవెలకుంట్ల స్టేషన్ నుంచి సంజామల స్టేషన్‌కు రైలు వెలుతుండగా రైలుకు విద్యుత్ సరఫరా చేసే ఒక స్తంభం కడ్డీ వేలాడుతుండటంతో డైవర్ అప్రమత్తతో వెంటనే ట్రైన్‌ను ఆపారు. సమాచారం స్టేషన్‌కు అందించి ఆ కడ్డీని యథాస్థితిలో అమర్చారు.