ప్యాపిలి: మండల పరిధిలోని కలచట్ల గ్రామా సర్పంచ్ బి. రమాదేవి, రామ్మూర్తి దంపతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తన ఇంటిపై శనివారం జాతీయ జెండాను ఎగుర వేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సమరయోధులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి భారత సమైక్యతను చాటి చెప్పాలన్నారు.