మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ, శివసంగ్రామ్ పార్టీ నాయకుడు వినాయక్ మేటే ఆదివారం మరణించారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉదయం జరిగిన ప్రమాదంలో ఆయన చనిపోయారు. మడప్ టన్నెల్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మరాఠా కమ్యూనిటీకి ప్రత్యేక రిజర్వేషన్ కోరుతూ ఆయన ఉద్యమిస్తున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa