స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, 'దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలి. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో ముందుంది. కరోనా కష్టాలను అధిగమించాం. కరోనా తర్వాత మన ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి' అని తెలిపారు.