ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరంట్లకు స్వాగతం పలికే ర్యాలీకి పోలీసుల నో పర్మిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 09:04 PM

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు తాజాగా పోలీస్ శాఖ నుంచి షాక్ తగిలింది. అశ్లీల వీడియో కాల్ ఆరోపణలు ఎదుర్కొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఢిల్లీ నుంచి వస్తున్న నేపథ్యంలో అనంతపురంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆరోపణలు నిరాధారమైనవని పోలీసులు తేల్చడంతో సొంత జిల్లాకి వస్తున్న ఎంపీకి భారీగా ఆహ్వానం పలికేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఆంధ్రా బార్డర్ నుంచి అనంతపురం వరకు వెహికల్స్‌తో ర్యాలీ చేపట్టేందుకు గోరంట్ల అభిమానులు సిద్ధమయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా అనంతపురంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టుల చేశారు.


గోరంట్ల మాధవ్‌కు వ్యతిరేకంగా చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు అందించారు. అతనితో పాటు అనంతపురం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రమణకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీ నరసింహను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు.


ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. ఎంపీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన అనంతపురం పోలీసులు అది ఒరిజినల్ వీడియో కాదని తేల్చారు. ఈ విషయమై బాధితులు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఐటీడీపీ అకౌంట్స్ నుంచే ఈ వీడియో వచ్చినట్లు ఎస్పీ తేల్చి చెప్పారు. వీడియోను వేరే ఫోన్‌లో చూస్తుండగా రికార్డ్ చేసి వదిలారని.. ఈ వీడియో అనేకసార్లు ఫార్వార్డ్ చేయడంతో ఒరిజినలా, ఫేకా అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరాధారమైనవని తేలిన తర్వాత ఢిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించిన గోరంట్ల మాధవ్ ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com