ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా ప్రతీ టీడీపీ కార్యకర్త, నాయకులు, అభిమానులు ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైనందున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేయాలన్నారు. తద్వారా దేశంపై తమ బాధ్యతను, దేశ భక్తిని చాటాలని కోరారు.