దూసి రైల్వేస్టేషన్లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సమావేశానికి రైలు దిగుతున్నారు మహాత్మా గాంధీ మహాత్మా మన్నించుమా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో రైల్వే స్టేషన్ సమీపం లో నిర్వహించిన సమావేశానికి మహాత్మ గాంధీ హాజరయ్యారు. ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమం నాయకులతో కలిసి పలు విషయాలు మాట్లాడారు. స్వతంత్రం సాధించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలో సమావేశంలో చెప్పినట్లు ఉద్యమ నాయకుల లతో కలిసి పలు విషయాలు మాట్లాడారు. స్వతంత్రం సాధించేందుకు దూసి ప్రాంతంలో ఉన్న వృద్ధులు నాయకులు చెబుతున్నారు.
బ్రిటిష్ వారు మన దేశం నుండి ఏవిధంగా వెళ్ళగొట్టాలో వారికి తెలియకుండా రాత్రివేళల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేందుకు గాంధీ దేశమంతా తిరుగుతూ దూసి చేరుకున్నారు. అప్పటికే జిల్లాలో స్వతంత్ర ఉద్యమం పోరాటం జోరుగా సాగుతోంది. గాంధీజీ రైల్వేస్టేషన్ వస్తారని సమాచారం రావడంతో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మహాత్ముడు కొంతమంది జాతీయోద్యమ నాయకులతో కలసి స్టేషన్కు చేరుకున్నారు. ఉద్యమ నాయకులు దూసి వద్ద గాంధీజీ తో మాట్లాడేందుకు వేదిక ఏర్పాటు చేసినప్పటికీ గాంధీ మాత్రం రైలు నుండి అక్కడే మాట్లాడారని అప్పుడు పాల్గొన్నవారు తెలిపారు. గాంధీజీ రావడంతో రైల్వే పెట్టి ఎక్కీ మెట్లు నుండి మాట్లాడుతూ జాతీయ ఉద్యమ స్ఫూర్తి శాంతియుత పోరాటం పై ప్రజలను చైతన్యవంతులను చేశారు.
ఆనాటి ఉద్యమకారులు ఈ ప్రాంతం నుండి పంచాధి సత్యనారాయణ, చౌదరి సత్యం, కిల్లి. అప్పలనాయుడు, గౌతు లచ్చన్న లతోపాటు బెలమాం, కణుగులవలస, దూసి , తోటాడ గ్రామాలకు చెందిన ఉద్యమకారులు ఉన్నారు. నాడు గాంధీజీ దూసి రైల్వేస్టేషన్లో దిగడంతో రైల్వేస్టేషన్లో గాంధీ విగ్రహం పెట్టేందుకు మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ప్రతిపాదన పెట్టారు. అయితే అప్పట్లో గాంధీ విగ్రహం పెట్టేందుకు దిమ్మ కూడా ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం తో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారు. మహాత్ముని విగ్రహాలు ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యమ కారులు ఆవేదన వ్యక్తం చేశారు.