బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదివరలోనే వంశధార కాలువల నుంచి చెరువులు నింపడంతో ప్రస్తుతం పడుతున్న వర్షాలకు చెరువులు నిండి చష్టాల పైనుంచి ప్రవహిస్తోంది. జలుమూరు మండలం కరవంజ పెద్ద చెరువు, కృష్ణసాగరం వంటి పెద్ద చెరువులు నీటితో నిండి చష్టాల పైనుంచి నీరు ప్రవహిస్తుంది.