క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 1927లో శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన మహాత్మా గాంధీ కె సి రోడ్డు పక్కన సారవ కోట మండల కేంద్రంలో పర్లాకిమిడి జమిందార్లు కట్టించిన విశ్రాంతి బంగ్లాలో ఒక రాత్రి బస చేశారు. స్వాతంత్ర సమరయోధుడు బోయిన అప్పలస్వామి గిరిజనుల అటవీ హక్కుల కోసం బోయిన అప్పలస్వామి పర్లాకిమిడి జమిందార్లతో పోరాడేవారు. అప్పలస్వామి పై 140 కేసులు ఉండేవని కేసుల కోసం నెలలో ఇరవైకి పైగా రోజులు మద్రాస్ కోర్టు చుట్టూ తిరిగే వారిని చెప్తుంటారు.
ఈ విషయం తెలిసిన గాంధీజీ అప్పలస్వామిని కలిశారు. ఈ సందర్భంగా అప్పలస్వామి, గాంధీజీకి బొప్పాయి పళ్ళు, పల్లీలు, మేక పాలు అందజేశారు. ఆ తరువాత ఈ విశ్రాంతి భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి, దీనికి గంధీ గ్రంథాలయంగా పేరు పెట్టారు. 30 ఏళ్ల క్రితం సారవకోట వచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్ చెల్లప్పకు ఆ భవనం ప్రాముఖ్యత గురించి గ్రామస్తుల వివరించారు. స్పందించిన కలెక్టర్ ఆ భవనానికి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించారు.
1991లో నాటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సాంబశివరావు, పార్లమెంట్ సభ్యులు కణితి విశ్వనాథం, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీపీ చిన్నాల కృష్ణారావు నాయుడు ప్రారంభించారు. మహాత్మా గాంధీ బసచేసిన చరిత్ర ను అప్పలస్వామి మనుమడు గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. గ్రంథాలయానికి వచ్చిన కొత్త వారు మహాత్మా గాంధీ ఎందుకు ఈ ప్రదేశానికి వచ్చారో దీని ద్వారా తెలుసుకుంటున్నారు.