పుంగనూరు నియోజకవర్గం సదుం మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 1200 లీటర్ల నాటుసారా ఊటను ఆదివారం సాయంత్రం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా నాటుసారాను తయారు చేసినట్లు తెలిస్తే దాడులు నిర్వహించే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.