మహాత్మాగాంధీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న నూతి రాధాకృష్ణయ్య క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. నిస్వార్థ, ప్రజాసేవకునిగా పేరొందారు. భూదాన ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా మదనపల్లెలో బ్రిటీష్ జెండాలాగి లాఠీ దెబ్బలు చవి చూశారు. 1962 లో కాంగ్రెస్ పార్టీ తరఫున మదనపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.