చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మామడుగు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి బెంగుళూరుకు కారులో ఓ కుటుంబం వెళుతుండగా టైర్ పేలి ఆగి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, బాలుడు స్పాట్ లోనే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa