ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ తన ప్రతిభను చూపుతూ హర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల సమైక్యతను చాటుతూ చిత్రాన్ని సోమవారం రూపొందించారు. పలువురు జిల్లా అధికారులు ఈ సైకత చిత్రాన్ని చూసి సనత్ కుమార్ ను అభినందించారు.