సెన్సర్ సమస్య తలెత్తడం వల్లే ఎస్ఎస్ఎల్వీ-డీ1 నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయిందని షార్ డైరెక్టర్ రాజరాజన్ వివరించారు. ఈ లోపాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.
ఇక, సెప్టెంబరు, అక్టోబరులో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్ ప్రయోగం చేపట్టబోతున్నామని వెల్లడించారు. గగన్ యాన్ లో తొలుత మానవరహిత ప్రయోగాలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందని రాజరాజన్ వివరించారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా 4 ప్రధాన గ్రౌండ్ టెస్టులు జరపాల్సి ఉందని అన్నారు. 2023 ఫిబ్రవరి-జులై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు. 4 నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోందని తెలిపారు.