బాపట్ల: భట్టిప్రోలు గ్రామపంచాయతీ పరిధిలోని అద్దేపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని సెబ్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అద్దేపల్లి గ్రామానికి చెందిన రామనాథం శ్రీనివాసరావు వద్ద 47 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని అతనిని మంగళవారం కోర్టులో హాజరు పరిచనున్నట్లు సెబ్ సీఐ ఏ. లీనా తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం కలిగి ఉన్న అమ్మకాలు జరిపిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.