వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్టుగా బటన్ నొక్కుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని అన్నారు.