చేపలను ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అల్జీమర్స్ సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.
- చేపలను ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
-చేపలను తరచూ తింటే వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
-చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాకుండా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు.
-స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలంటే, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రావొద్దంటే తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.