ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ ఆరోగ్య శ్రీ పరిధిని రోజురోజుకు విస్తరించుకొంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ నేడు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా మరో 754 చికిత్సలను చేర్చుతున్నట్టు వెల్లడించారు. దాంతో, ఆర్యోగశ్రీ కింద లభించే చికిత్సల సంఖ్య 3,118కి పెరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, ఇకపై మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.