మంగళగిరి అంటే కొందరు పాత్రికేయులు ఎప్పుడో 1985 ఏపీ తొలి మధ్యంతర ఎన్నికల నాటి ముచ్చట గుర్తుచేస్తున్నారు. అప్పుడు మంగళగిరి స్థానం నుంచి ఓ ప్రముఖ సినీనటి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి మూడున్నర వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మళ్లీ మంగళగిరి ముఖం చూడలేదు. ఆమె ఓటమిపై అప్పట్లో–‘వద్దంటే వెళ్లాను మంగళగిరికి’ అని తెలుగు దినపత్రికలు శీర్షికలు కూడా పెట్టాయి. అలాగే లోకేష్ బాబు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు అని వైసీపీ నాయకులూ ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 20 మాసాల దూరం మాత్రమే ఉండడంతో, 39 సంవత్సరాల వయసులో ఆయన మంగళగిరిలో చాలా గట్టిగా జనం మధ్య తిరుగుతున్నారు. అయితే, ‘తన నియోజకవర్గ’ పర్యటనల్లో భాగంగా ‘టెన్త్ పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు’ అంటూ చదువుకోలేకపోయిన యువకులను అవమానించే రీతిలో చంద్రబాబు ‘సుపుత్రుడు’ ఎడాపెడా మాట్లాడడం ఏమాత్రం సభ్యతగా లేదు. అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో డిగ్రీ చదవడానికి తనకు బిలియనీర్లు సాయపడినట్టుగా పేదలకు సంపన్నులు తోడ్పాటు అందించరనే విషయం చినబాబు గ్రహిస్తే మంచిది అని అన్నారు