ఏపీలో కంపెనీ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లటం కంటే ముందే కమీషన్లు తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లాలి అని టీడీపీ నాయకులూ అచ్చేమ్ నాయుడు ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... పరిశ్రమలపై క్రెడిబులిటి చంద్రబాబు నాయుడిది, పబ్లిసిటి జగన్ రెడ్డిది 3 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన తప్పులు, అప్పులతో పాటు నిరుద్యోగం కూడా పెరిగింది.
ఏపీలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదివరకు ఎప్పుడూ వినని "ప్రభుత్వ టెర్రరిజం" అన్నమాట విన్నారు పారిశ్రామికవేత్తలు. కొన్ని కంపెనీలు భూములు తిరిగిచ్చేసి వెళ్ళిపోతే, ఇంకొన్ని కంపెనీలను వీళ్ళే భూములు లాక్కుని వెళ్లగొట్టారు అని ఆరోపించారు.