ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చేతుల మీదుగా ' గ్రామదర్శిని ' వెబ్ అప్లికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 12:08 PM

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి , సంక్షేమం తదితర కార్యక్రమాలపై జిల్లాలో రూపొందించిన ' గ్రామదర్శిని ' వెబ్ అప్లికేషన్ సీఎం జగన్  లాంఛనంగా ఈనెల 23న పెడన బహిరంగ సభ నుంచి ప్రారాంభిస్తున్నారని కృష్ణా  జిల్లా కలెక్టర్ పి .రంజిత్ బాషా చెప్పారు. 


బుధవారం ఆయన జిల్లా అధికారులు , వారి సహచర ఉద్యోగులతో వై . ఎస్ . ఆర్ . నేతన్న నేస్తం పథకం కింద నాల్గవ విడత నిధుల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు . 


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులైన మెడికల్ కళాశాల నిర్మాణం , హార్బర్ నిర్మాణం , పోర్టు పనులు , నేషనల్ హైవే పనులు , చేనేత వస్త్రాల ప్రదర్శన ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు .


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల , జిల్లా ఎస్ . పీ .  పి . జాషువా , జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , ఆర్ . డీ . ఓ . లు తదితరులు పాల్గొన్నారు . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com