చలికాలంలో చర్మం పొడిబారటం మామూలే. అయితే దీనిని నివారించుకునేందుకు, చర్మం నిగనిగలాడేలా చేసుకునేందుకు ఉసిరి కాయల రసం బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి కాయ రసం చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.
చర్మం మీద నల్ల మచ్చలను, నలుపును ఉసిరి తొలగిస్తుంది. మొటిమలను ప్రేరేపించే హార్మోన్లు సమతులంగా ఉండటానికీ దోహదం చేస్తుంది. రోజూ ఉదయాన్నే నాలుగైదు ఉసిరి కాయల రసాన్ని తీసుకోవాలి. అందులో కాస్త తేనె, పసుపు కలిపి తాగాలి. తాజా ఉసిరికాయలు దొరక్కపోతే ఉసిరి చూర్ణమైనా తీసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.