అనంతపురం జిల్లాలోని గుత్తి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, రికార్డులు, రిసెప్సన్ సెంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీసు స్టేషన్ , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
గుత్తి పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉంటున్న తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసులను సమీక్షించారు.శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దన్నారు.