చిలకలూరిపేట: పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతానికి చెందిన పఠాన్ యాసిన్ (32) కూలి పనులు చేస్తుంటాడు. ఈనెల 10వ తేదీ భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెంది ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.