తుళ్లూరు: అక్రమ మట్టి తవ్వకాలపై టీడీపీ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డమానులో అమరావతికి వెళ్లే రోడ్డు పక్కన కొంతమంది గుంతలు తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధానిలోని అనేక గ్రామాల్లో మట్టి గ్రావెల్, ఇనుము నిర్మాణం లాంటి సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, నిర్లక్ష్యం వీడి పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.