గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొల్లపాలెం వద్ద ప్రభుత్వ నిషేదిత గుట్కా, సిగరెట్లు అమ్ముతున్నారని సమాచారంతో గ్రామంలో ఎస్సై వెంకటాద్రి తమ సిబ్బందితో వెళ్లి దాడి చేసి మద్దుల సురేష్ కుమార్ ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి సుమారు 2 వేల రూపాయల విలువ కలిగిన గుట్కా, సిగరెట్లు ప్యాకెట్లు స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిపై కేసును నమోదు చేసి త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్సై వెంకటాద్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa