నరసరావుపేట: బావ మరిది పై బావ దాడికి పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. రామిరెడ్డి పేటకు చెందిన షేక్ నాగుల్ మీరా సోదరిని జానీ భాషా వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా జానీ భాషా చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయంపై నాగుల్ మీరా అడిగినందుకు అతనిపై కత్తితో జానీ భాషా దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అశోక్ కుమార్ తెలిపారు.