ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ సీఐడీ గురువారం వివరణ ఇచ్చింది. ప్రైవేట్ లాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదని, రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికం అని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తెలిపారు. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని, ఆ వీడియోని మూడో వ్యక్తి షూట్ చేశాడని తెలిపారు. రిపోర్టును మార్ఫింగ్ చేసి తన పేరు మీద ప్రచారం చేశారని, చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.