వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
- రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.
- వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి.
- వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.
- స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారు చేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
- వెల్లుల్లి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
- హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది.
- వెల్లుల్లి వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది.
- వెల్లుల్లిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
- వెల్లుల్లిలో విటమిన్ బీ- 6 పుష్కలంగా ఉంటుంది, ఇది అండోత్సర్గములో సహాయపడుతుంది.
- వెల్లుల్లి రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది.
- చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.