ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించింది.