యూరప్ దేశాల్లో కరువు తీవ్రత ఎక్కువైంది. నదులన్నీ ఎండిపోయి తాగడానికి నీరు దొరకని పరిస్థితి ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ దేశాల్లో ఈ పరిస్థితులున్నాయి. దీంతో ఆవులు తాగే నీళ్లపై రోజుకు 100 లీటర్లు అంటూ షరతు పెట్టారు. ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, పూల్స్‌లో నీళ్లు నింపడాన్ని నిషేధించారు. ట్యాంకుల సాయంతో తాగునీటిని అందిస్తున్నారు.