రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్లో వైద్య విద్య చేస్తున్న 20 వేల మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఉక్రెయిన్ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసులను ప్రారంభించనున్నాయి. తప్పనిసరి క్రాక్ పరీక్షను అక్టోబర్లో ఆఫ్లైన్ రీతిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ మెడికల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.