ఏపీలో మరో 3 రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాబోవు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.