హరారే వేదికగా 3 వన్డేల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ప్రసిధ్ కృష్ణ లు ముగ్గురు మూడు వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయి.. టీమిండియా ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.