దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 60,298కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,957 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : కోటక్ బ్యాంక్ (3.80%), ఎల్ అండ్ టీ (2.03%), భారతీ ఎయిర్‌టెల్ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.31%).
టాప్ లూజర్స్ : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.30%), విప్రో (-1.67%), ఇన్ఫోసిస్ (-1.38%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.92%), యాక్సిస్ బ్యాంక్ (-0.87%).