ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత పార్టీ నేతలపై అనిల్ కుమార్ ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 12:13 PM

సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కీలక ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో తనను బలహీనపరిచేందుకు తమ పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులకు కొందరు డబ్బులిచ్చి తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులతో టచ్‌లో ఉంటూ టీడీపీ నాయకుల్లో ఒకరు రోజుకు రూ. 10 వేలు, మరికొందరు లక్ష రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com