ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్ల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గాయాలు, ప్రమాదాల వల్ల మోకాళ్లలో నొప్పి రావడం సహజం. కానీ కొన్నిసార్లు ఆహారంలో పోషకాల కొరత వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. అందుకే రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో మంటను కలిగించే ఎంజైమ్‌లు తగ్గడం ప్రారంభిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి.
- నట్స్ లో విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. నట్స్ తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
- అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిలో ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా ఈ రెండు దినుసులని డైట్ లో చేర్చుకుంటే మంచిది. అల్లం, పసుపు కలిపి కషాయం చేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
- నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ వంటి పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల వాపును తగ్గిస్తాయి.
- విటమిన్ డి, కాల్షియం పాలు, అన్ని పాల ఉత్పత్తులలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల పటిష్టతకు మేలు చేస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు పాలు ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.