ఫేక్ వీడియోతో బీసీ ఎంపీనైన తనను టీడీపీ అధినేత చంద్రబాబు వేధిస్తున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో 'బ్రీఫ్డ్ మీ' అనింది తాను కాదని చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. మహిళలకు కడుపు చేసేయాలన్న బాలకృష్ణ కూడా తనపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.