ఆ గ్రామంలో వీధి కుక్కుల పేరుపై రూ.5 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించారు గ్రామస్తులు. ఆ భూమిపై వచ్చే ఆదాయాన్ని కూడా వాటి కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే.. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలోని కుశాకల్ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమి కేటాయించారు. నవాబుల కాలంలో వ్యవసాయం కోసం గ్రామస్తులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధికుక్కలకు కేటాయించారు.