హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. గోహార్ సబ్ డివిజన్ జాదోన్ గ్రామంలో ఖేమ్ సింగ్ అనే వ్యక్తి ఇంటిపై శనివారం తెల్లవారు జామున కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కుటుంబంలోని ఏడుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. చంబా జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదంలో మరో ముగ్గురు చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa